![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -177 లో....మాధవ పెళ్లి జరగాలంటే అమ్మవారిని దర్శించుకోవాలని పంతులు చెప్తాడు. గ్రామ దేవత ఎక్కడ ఉందో, పూజ ఎలా చేయాలో తెలియక చక్రి, కేశవ, మహా తికమక పడతారు. నారాయణను అడిగితే .. నాకు తెలీదు, మా పెద్దలు ఏమీ చెప్పలేదని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. రమణయ్యను పెద్ది అడిగినా.. మీ నాన్నకు తెలియదా అని కోపంగా వెళ్లిపోతాడు. ఇదే టైంలో మాధవ పనికి వెళ్తుంటే కన్నా తోడు వెళ్తాడు. దారిలో అందరు మాధవ గురించి అడగడంతో కన్నా సీరియస్ అవుతాడు. చివరికి చక్రి ఒక ప్లాన్ వేసి సాధువుతో రమణయ్యను భయపెడతాడు. గ్రామ దేవత ఆగ్రహించింది, భక్తులకు దారి చెప్పలేదని సాధువు అనడంతో రమణయ్య భయపడి రుద్రవరం, రుద్రాంబిక దేవత వివరాలు చెప్పేస్తాడు.
ఇదే సమయంలో మనీషా బావ టిట్లా సిటీకి వచ్చి ఆమె కోసం రౌడీలతో వెతికిస్తూ ఉంటాడు. భన్సీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డైరెక్ట్ గా వచ్చేస్తాడు. భయపడిన భన్సీ వెంటనే మనీషాను తీసుకుని పారిపోయి మాధవ దగ్గరికి వస్తాడు. టిట్లా బలవంతంగా పెళ్లి చేసుకుంటాడేమోనని భయపడి.. నేను వాడిని పెళ్లి చేసుకోను, ఫోన్ కూడా లిఫ్ట్ చేయనని మనీషా క్లియర్ గా చెబుతుంది. మాధవ ధైర్యం ఇస్తాడు. పెద్ది.. మనీషా కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటుంది, మనం అందరం ఉంటాం కాబట్టి సేఫ్ అని ఆశ్రయం ఇస్తాడు. చక్రి దీన్నే.. మహారాణికి కాపలా ఉద్యోగం..అంటూ కేశవ, కన్నాకు చెప్పి అందరినీ మనీషాకు అండగా నిలబెడతాడు.
మహా గాయత్రికి ఫోన్ చేసి ఊరి గురించి అడుగుతుంది, కానీ గాయత్రికి ఊరి పేరు తెలియక కొండల మధ్య ఉంటుందని మాత్రమే చెప్తుంది. పెద్దితో చక్రి.. నీ కథ, మనీషా కథ ఒకటే, గ్రామ దేవతే ఆమెను మన ఇంటికి పంపింది, పెళ్లి చేసుకో అంటాడు. ఆశ్రయం కోరిన వారిని అలా చూడొద్దు, ముందు దేవత వివరాలు కనుక్కుందామని పెద్ది అంటాడు. చివరికి గ్రామ దేవత అడ్రస్ దొరికినట్టు చక్రి చెప్పడంతో అందరు కలిసి రుద్రవరం వెళ్దామని ఫిక్స్ అవుతారు. మొదట్లో మహా రానని అంటుంది. తర్వాత పెద్ది మొక్కు కదా వస్తానని ఒప్పుకుంటుంది. నారాయణ కూడా నేను కూడా వస్తాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |